![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో.. కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన మధు గట్టిగా అరుస్తాడు. అది విని భవాని.. ముకుంద తన ప్రేమ గురించి ఈ గదిలో చూస్తే తెలుస్తుందని కూడా పట్టించుకోకుండా, కృష్ణ, మురారీల దగ్గరికి వెళ్తుంది. మురారి తలకి ఉన్న కట్టు చూసిన భవాని.. మురారికి ఏమైందోనని కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, ఏమైందని అడుగుతుంది. అప్పుడు కృష్ణ జరిగిందంతా భవానికి చెప్తుంది.
ఆ తర్వాత మురారిని కాపాడింది కృష్ణనే అని తన గురించి గొప్పగా భవానికి రేవతి చెప్పగానే.. చాలా థాంక్స్ అని భవాని చెప్తుంది. తన భర్తని తను ఎప్పుడు కాపాడుకుంటునే ఉంటుందని రేవతి అంటుంది. ఆ తర్వాత ఇంటికి పెద్ద కోడలు ముకుంద.. నువ్వు వాళ్లకి హారతి ఇవ్వు అని చెప్పగానే ముకుంద కోపంగానే హారతి ఇస్తుంది. కృష్ణ, మురారిలని ఎవరు విడదీయలేరని మధు అనుకుంటాడు. పాపం ముకుంద.. తన ప్రేమ దక్కించుకుంటానని అనుకుంది. ఎంత ఫీల్ అవుతుందో అని అలేఖ్య అనుకుంటుంది. ఆ తర్వాత అలేఖ్య, మధు ఇద్దరు కలిసి కృష్ణ రావడం గురించి మాట్లాడుకుంటారు. మరొక వైపు మళ్ళీ కృష్ణ ఎందుకు తిరిగి వచ్చిందని మురారిని ముకుంద అడుగుతుంది.
మళ్ళీ ముకుందకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది. అలా కాకుండా చూడాలని మురారి అనుకుంటాడు. అప్పుడంటే మేము అగ్రిమెంట్ మ్యారేజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఇద్దరం అలా లేమని కృష్ణపై తన ప్రేమని చెప్తాడు.. ఆదర్శ్ మంచివాడు తనతో మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చెయ్ అని మురారి చెప్తాడు. కానీ ముకుంద మాత్రం మురారితోనే కలిసి ఉంటానని అనుకుంటూ.. నీ ప్రేమ కావాలని ఎప్పటిలాగే మాట్లాడుతుంది. మన ప్రేమ విషయం ఎలాగు పెద్ద అత్తయ్య తెలుసుకోవాలని అనుకుంటుంది. అదేదో నేను చెప్తానని మురారిని ముకుంద బ్లాక్ మెయిల్ చేయగానే మురారి టెన్షన్ పడతాడు.
మరొక వైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. మీరు నాకు అబద్ధం చెప్పి తీసుకొని వచ్చారా లేక ఏసీపీ సర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా అని కృష్ణ అడుగుతుంది. నేను అబద్ధం చెప్పలేదు. నిజంగానే మురారి నిన్ను ప్రేమిస్తున్నాడని రేవతి చెప్తుంది. ఏసీపీ సర్ నా మీద ఉన్న ప్రేమని నాకు చెప్పేలా నేనే చేస్తాను. ఏసీపీ సర్ నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలుసని మీరు చెప్పకండని రేవతికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు మురారితో భవాని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |